ముచుకోటలో ప్రభుత్వ భూమి స్వాధీనం

ముచుకోటలో ప్రభుత్వ భూమి స్వాధీనం

ATP: పెద్దపప్పూరు మండలం ముచుకోట గ్రామంలోని కాటమరాజు స్వామి ఆలయం దగ్గర ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సర్వే నంబర్ 208లో సుమారు 5.22 ఎకరాల భూమిని స్థానికులు ఆక్రమించినట్లు గుర్తించి పంచనామా నిర్వహించారు. అనంతరం సరిహద్దులు నిర్ణయించి భూమిని తిరిగి ప్రభుత్వాధీనంలోకి తీసుకున్నారు.