పెచ్చులూడుతున్న పాఠశాల భవనం
ELR: ముదినేపల్లి మండలం సింగరాయపాలెం MPP పాఠశాలలో ఇటీవల మొంథా తుఫాన్ కారణంగా భవనం పైకప్పు నుంచి నీరు కారి శ్లాబ్ పెచ్చులూడి పడుతున్నాయి. వెంటనే స్పందించిన ఎంపీపీ సత్యనారాయణ శుక్రవారం పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామ సర్పంచ్ బోయిన విమల రామరాజుని ఆదేశించారు.