నమూనాలు తీయకుండానే రక్త విశ్లేషణ

నమూనాలు తీయకుండానే రక్త విశ్లేషణ

ICUలో చికిత్స పొందే రోగుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి పదేపదే రక్త నమూనాలు తీసి ల్యాబ్‌కు పంపుతుంటారు. అయితే, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన బాల్ చందర్ అనే వైద్యుడు రక్త విశ్లేషణ వ్యవస్థ అనే వినూత్న పరిష్కారం కనుగొన్నారు. ఈ పరికరం రోగి నుంచి చుక్క రక్తం కూడా తీయకుండానే రక్తంలోని వివిధ మాలిక్యూల్స్, లవణాల శాతాన్ని అనుక్షణం కనిపెట్టి మానిటర్‌పై చూపుతుంది.