డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన PD
MNCL: బెల్లంపల్లి పట్టణంలో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో డబ్బుల వ్యవహారం రచ్చకెక్కడంతో బుధవారం ఇందిరమ్మ పథకం PD బన్సీలాల్ క్షేత్రస్థాయిలో ఇళ్లను పరిశీలించారు. ఎంపికైన లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నిరుపేదలైన అర్హులకే ఇళ్లను కేటాయించేలా చర్యలు చేపడతామన్నారు.