ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం
RR: అనేక ఉద్రిక్త పరిస్థితుల తరువాత ఇవాళ ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్‌గా టేకులు సుదర్శన్ రెడ్డి (బీఆర్ఎస్) ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్‌గా ముత్యాల శ్యామల బీజేపీ నుంచి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ ప్రక్రియను బహిష్కరించినప్పటికీ, కోరం ఉండడంతో అధికారులు ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు.