పీహెచ్సీని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

పీహెచ్సీని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

PPM: పార్వతీపురం మండలం డోకిశీలం గ్రామంలో పీహెచ్సీని మంగళవారం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలును గూర్చి రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు ఎప్పుడు అందుబాటులో ఉండాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా పీహెచ్సీ వైద్యులు ఐశ్వర్యను ఆదేశించారు.