చోరీ కేసులో నిందితులు అరెస్టు
KRNL: కోసిగిలో ఉరుకుంద ఆర్చి సమీపంలో నివాసం ఉన్న జోళ్లు లీలావతి ఇంటిలో ఈనెల 6వ తేదీన పట్టపగలే జరిగిన దొంగతనం కేసులో నిందితులు అంజినయ్య, పరుశురామ్‌లను అరెస్ట్ చేసినట్లు సీఐ మంజునాథ్ ఆదివారం తెలిపారు. వారి వద్ద నుంచి దొంగిలించిన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులపై చోరీ కేసుతోపాటు పలు కేసులలోను నిందితులుగా ఉన్నారని తెలిపారు.