జాతీయ లోక్ అదాలత్‌లో 321 కేసులు పరిష్కారం

జాతీయ లోక్ అదాలత్‌లో 321 కేసులు పరిష్కారం

VZM: గజపతినగరం కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో 321 కేసులు పరిష్కారం అయ్యాయి. ఈ సందర్భంగా న్యాయమూర్తి బి.కనకలక్ష్మి మాట్లాడుతూ రాజీయే రాజమార్గమని కక్షిదారులు గుర్తించాలన్నారు. కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు లెంక రాంబాబు, కొల్లూరు సాయి శేఖరరావు న్యాయవాదులు పాల్గొన్నారు.