ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ మెంబర్ సుడిగాలి పర్యటన
VZM: గంట్యాడ మండల కేంద్రంలో ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ మెంబర్ శ్రీదేవి మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. ఈమేరకు అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ డిపో, సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని, PHCని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై ఆరా తీసి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో మాణిక్యంనాయుడు, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.