ఆయిల్ పామ్ సాగుతో లాభాలు: మంత్రి తుమ్మల

KMM: ఆయిల్ పామ్ సాగుతో రైతన్నను రాజుగా మార్చడమే తన కలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులు నష్టాల బారిన పడకుండా లాభాలు తెచ్చిపెట్టే పంట ఆయిల్ పామ్ అని తుమ్మల తెలిపారు . తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయ్యే నాటికి పామాయిల్ గెల ధర భారీగా పెరిగిందని మంత్రి తెలిపారు.