కడెం ప్రాజెక్టులో నాలుగు గేట్ల ద్వారా నీటి విడుదల

NRML: కడెం ప్రాజెక్టులో 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం ఉదయం ప్రాజెక్టులో 694.60 అడుగుల నీటిమట్టం ఉందని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి 16,764 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో ఎడమ కాలువకు 263, కుడి కాలువకు 20, మిషన్ భగీరథ 9 దిగువకు 22,520 మొత్తం కలిపి 22,896 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.