నందిగామలో ప్రభుత్వ ఆసుపత్రికి భూమి పూజ

నందిగామలో ప్రభుత్వ ఆసుపత్రికి భూమి పూజ

NTR: నందిగామ దేవినేని వెంకటరమణ సామాజిక ఆరోగ్య కేంద్రంలో 100 పడకల విస్తరణ కోసం భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ ఆసుపత్రి శంకుస్థాపన 1998 సెప్టెంబర్ 10న జరిగిందని అన్నారు. ఆనాటి ఎమ్మెల్యే దేవినేని వెంకటరమణ ప్రజాసేవా భావనతో ఈ ప్రాజెక్ట్ మొదలైందని తెలిపారు.