'సమీకృత అభివృద్ధి కోసమే శిక్షణ కార్యక్రమాలు'
VZM: సమీకృత అభివృద్ధి కోసమే శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్ పాని అన్నారు. శుక్రవారం గజపతినగరంలోని వెలుగు కార్యాలయంలో ఏపీఎం నారాయణరావు ఆధ్వర్యంలో విజన్ బిల్డింగ్ పై శిక్షణ మూడో రోజు జరిగింది. గ్రూపులోని సభ్యురాలే కాకుండా సమాజంలో అందరూ అభివృద్ధి చెందాలన్నదే లక్ష్యం అన్నారు.