మంత్రాలయంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
KRNL: మంత్రాలయంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ దందా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మండలంలో ఇసుక రీచ్ లేకపోయినా అనధికారికంగా తుంగభద్ర నది నుంచి రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను తోడేస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. ఉచిత ఇసుక పాలసీని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడుతున్నారు. కాగా, రిపోర్టు జీపీఎస్ నిబంధన అమలు కావడం లేదనే చర్చ జరుగుతోంది.