పొన్నలూరు ప్రాథమిక ఆసుపత్రిని సందర్శించిన ఎంపీడీవో

పొన్నలూరు ప్రాథమిక ఆసుపత్రిని సందర్శించిన ఎంపీడీవో

ప్రకాశం: పొన్నలూరు మండల కేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల స్పెషల్ ఆఫీసర్ వరలక్ష్మి, MPDO సుజాత, తహశీల్దార్ పుల్లారావు సందర్శించారు. ఇందులో భాగంగా ప్రజలకు అందుతున్న వైద్య సేవలను, ఫార్మసీ, లెబరేటరీ, పేషంట్ వార్డ్‌లను పరిశీలించారు. అనంతరం వైద్యులను అడిగి పూర్తి సమాచారం తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల నివారణ గురించి డాక్టర్లతో చర్చించారు.