శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

సంగారెడ్డి జిల్లా ప్రజలకు శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడు ధర్మానికి ప్రతీక అని, ఆయన ఆచరణలో చూపిన సత్యం, న్యాయం, కర్తవ్య నిష్ఠ ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని సూచించారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యత నెలకొనాలని ఆకాంక్షించారు. ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని కోరారు.