షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న భారత్‌, పాక్‌ క్రికెటర్లు

షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న భారత్‌, పాక్‌ క్రికెటర్లు

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత టీమిండియా ప్లేయర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వని విషయం తెలిసిందే. అయితే, ఈ ఆనవాయితీకి పుల్‌స్టాప్ పడింది. ICC అంధుల మహిళల టీ20 ప్రపంచకప్-2025లో భాగంగా పాక్‌పై భారత్‌ గెలిచింది. మ్యాచ్ అనంతరం భారత ప్లేయర్లు క్రీడాస్పూర్తిని చాటుకుంటూ పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.