రోడ్ల పనులకు రూ 9.28 కోట్లు నిధులు మంజూరు
VZM: ఎస్.కోట నియోజకవర్గంలోని పలు గ్రామాలకు సంబంధించి 15.56 కిలోమీటర్ల పొడవున్న రోడ్లకు రూ 9.28 కోట్లు నిధులు కేటాయించడం జరిగిందని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి గురువారం తెలిపారు. నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ది శాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.