నేడు నీటి సరఫరా నిలిపివేత
SDR: పట్టణంలో ఇవాళ మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పైప్స్ షిఫ్టింగ్ పనులు చేపట్టడమే దీనికి కారణమని వివరించారు. ప్రజలు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని, అత్యవసరమైతే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ఈ అంతరాయానికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.