VIRAL: బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థిని మృతి
రాజస్థాన్ జైపూర్‌లో విషాదం జరిగింది. నీరజా మోదీ స్కూల్‌లో 9 ఏళ్ల బాలిక 4వ తరగతి చదువుతోంది. నిన్న మధ్యాహ్నం విద్యార్థిని స్కూల్ బిల్డింగ్ 4వ అంతస్తు నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని పాఠశాల సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.