తాడ్వాయి ఎంపీడీవోగా రాజేశ్వరరావు
KMR: తాడ్వాయి మండల అభివృద్ధి అధికారిగా రాజేశ్వరరావు సోమవారం సాయంత్రం పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ ఇన్‌ఛార్జ్‌గా సబితా రెడ్డి పని చేశారు. ఆమె స్థానంలో గాంధారి MPDOగా పని చేసిన రాజేశ్వరరావును బదిలీపై వచ్చారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. మండల ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని చెప్పారు. ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.