వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎంపీ

వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎంపీ

WNP: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మి మోసపోవద్దని ఎంపీ మల్లు రవి అన్నారు. బుధవారం పెద్దమందడి మండలంలోని వెల్టూరు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మెగారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి కలిసి ప్రారంభించారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.