VIDEO: పాలస్తీనాకు మద్దతుగా శాంతి నిరసన

HYD: హైదరాబాద్ పాతబస్తీలోని మక్కా మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనల అనంతరం స్టూడెంట్స్ ఇస్లామిక్ సంస్థ పాలస్తీనాకు మద్దతుగా శాంతి నిరసన చేపట్టామని ఇస్లామిక్ సంస్థ నాయకులు తెలిపారు. భారత ప్రభుత్వం పాలస్తీనాకు మద్దతు ఇవ్వాలని, ఇజ్రాయెల్‌కు ఆయుధాలు సరఫరా చేయవద్దని విద్యార్థులు డిమాండ్ చేశారు. భారత ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు మద్ధతు ఇస్తే నిరసన కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు.