'బస్తాల్లోనే మొలకెత్తుతున్న ధాన్యం'

'బస్తాల్లోనే మొలకెత్తుతున్న ధాన్యం'

E.G: అల్లవరం మండల వ్యాప్తంగా ఇటీవల కురిసిన అకాల వర్షం రైతుల పాలిట శాపంగా మారింది. కళ్లాల్లోని ధాన్యం రాశులు, బస్తాల తడిసి గింజలు మొలకెత్తుతున్నాయి. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కళ్లాల్లోనే ఉంచడంతో వర్షానికి తడిసి ముద్దయ్యాయి. అధికారులు సార్వత్రిక ఎన్నికల్లో పడి రైతాంగాన్ని పట్టించుకోలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.