రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ శాతాలు
TG: రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 56.71 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలో 54.33 శాతం, వరంగల్‌లో 59.31, హన్మకొండలో 54.11, భద్రాద్రిలో 57.57, యాదాద్రిలో 56.51, సూర్యాపేటలో 60.07 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.