తెలుగు మహాసభలు.. చంద్రబాబుకు ఆహ్వానం
AP: గుంటూరులో 2026 జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు మూడో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ కలిశారు. ఈ కార్యక్రమానికి సతీసమేతంగా ముఖ్య అతిథిగా విచ్చేయాలని చంద్రబాబును కోరారు. ఆయన ఎంతో అనుకూలంగా స్పందించారని వెల్లడించారు.