'బస్టాండ్ అభివృద్ధి పనులు మొదలుపెడుతున్నాం'
KDP: పోరుమామిళ్ల ఆర్టీసీ బస్టాండ్‌లో త్వరలో అభివృద్ధి పనులు మొదలుపెడుతున్నామని బద్వేలు ఆర్టీసీ డిపో మేనేజర్ నిరంజన్ తెలిపారు. శనివారం పోరుమామిళ్ల ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశీలించిన ఆయన, ప్రతిరోజు 5 వేల మంది ప్రయాణికులు,100 పైగా సర్వీసులు తిరుగుతున్నాయని, ప్రయాణికులు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.