ప్రీ-ఐపీవో అంటూ వల.. రూ.51 లక్షలు టోకరా
ప్రీ-ఐపీవో పేరుతో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోయారు. IIFL క్యాపిటల్ పేరుతో ఫేస్‌బుక్‌లో ఫేక్ యాడ్ ఇచ్చి.. ఓ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగిని బురిడీ కొట్టించారు. భారీ లాభాల ఆశతో ఆయన విడతల వారీగా రూ.51.23 లక్షలు పెట్టుబడి పెట్టారు. యాప్‌లో ఆ విలువ రూ.1.30 కోట్లుగా చూపించి నమ్మించారు. తీరా డబ్బులు డ్రా చేద్దామంటే కుదరకపోవడంతో.. మోసపోయానని గ్రహించి లబోదిబోమంటున్నారు.