భర్త హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు

భర్త హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు

కడప: జిల్లా సిద్ధవటం మండలంలోని కపర్దీశ్వర స్వామి కోన వద్ద 2014లో జరిగిన హత్య కేసులో నలుగురు ముద్దాయిలకు కోర్టు జీవిత ఖైదు విధించింది. భర్తను హత్య చేసి బంగారు నగలు దోచుకున్న కేసులో భార్యతో పాటు మరో ముగ్గురిపై నేరం రుజువవడంతో కడప కోర్టు ఒక్కొక్కరికి జీవిత ఖైదు, రూ. 2000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.