మదనపల్లె-గుంటూరుకు సూపర్ ఫాస్ట్ రైలు

అన్నమయ్య: మదనపల్లె నుంచి గుంటూరుకు సూపర్ ఫాస్ట్ రైలును బుధవారం బీజేపీ జాతీయ నేత చల్లపల్లి నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ రైలు ప్రతిరోజు సాయంత్రం 3 గంటలకు సీటీఎంలో ప్రారంభమై పీలేరు, పాకాల, తిరుపతి, ఎర్రగుంట్ల, మార్కాపురం మీదుగా గుంటూరు చేరుకుంటుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు సీటీఎంకు చేరుకుంటుంది.