క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి: కలెక్టర్

NLG: నిత్యం పని ఒత్తిడిలో ఉండే పోలీసులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠి తెలిపారు. గురువారం నల్గొండలోని జిల్లా పోలీసు కార్యాలయంలో నల్గొండ డిస్ట్రిక్ట్ పోలీస్ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ప్రారంభించారు.