జాగ్రత్త.. కాసేపట్లో అతి భారీ వర్షం

జాగ్రత్త.. కాసేపట్లో అతి భారీ వర్షం

E.G: జిల్లాలో రాబోయే మూడు గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 50-60 కి.మీ ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. జిల్లా ప్రజలు ఎప్పటికప్పుడు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండరాదని హెచ్చరించింది.