ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

SRCL: ఇల్లంతకుంటలో ఆసుపత్రి నిర్మాణ పనులను మానకొండూర్ శాసనసభ్యుడు కవ్వంపల్లి సత్య నారాయణ పరిశీలించారు. కందికట్కూర్‌లో గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ దుకాణం ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి మహిళలకు పెద్దపీట వేస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు.