‘ఆశా కార్యకర్తల సమస్యలపై ఉద్యమం'

SKLM: ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శ్రీకాకుళం యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం ఏపీ ఆశా కార్యకర్తల యూనియన్ జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అమ్మన్ నాయుడు, తేజేశ్వరరావు మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రతకు చట్టం తేవాలన్నారు.