వాంకిడి మండల కేంద్రంలో వాహనాల తనిఖీలు
ASF: వాంకిడి మండల కేంద్రంలో SI తులసి రామ్ ఆధ్వర్యంలో శనివారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సరైన పత్రాలు లేకపోతే వాటిని సీజ్ చేస్తామని, ట్రిపుల్ డ్రైవింగ్ చేయరాదని, మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకు పంపుతామని ఎస్సై తులసిరాం హెచ్చరించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.