మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో పెరుగుతున్న వరద

BHPL: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలోకి వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. మంగళవారం ఉదయం 5,79,860 క్యూసెక్కుల వరద నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, ఎల్లంపల్లి గేట్ల ఎత్తివేతతో వరద పెరిగింది. బ్యారేజీ యొక్క 85 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.