నగరంలో స్ట్రీట్ లైట్స్ నిర్వహణపై CM సమీక్ష

HYD: మహానగరంలో గ్రేటర్ మున్సిపాలిటీ అధికారులతో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నగరంలో స్ట్రీట్ లైట్స్ నిర్వహణకు పెద్ద కంపెనీల నుంచి టెండర్లు పిలవాలని ఆదేశించారు. అలాగే పనితీరు పర్యవేక్షణకు ఐఐటీ వంటి సంస్థలతో థర్డ్‌పార్టీ ఆడిట్ చేయించాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.