కోటిలింగాల జాతరకు సర్వం సిద్ధం
KMM: సింగరేణి మండల పరిధిలోని పోలంపల్లి గ్రామపంచాయతీలో వెలసిన శ్రీ కోటిలింగేశ్వర స్వామి జాతర మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు నిర్వాహకులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం సమన్వయంతో చర్యలు చేపట్టింది.