16న జిల్లాలోకి అభ్యుదయం సైకిల్ యాత్ర
SKLM: మాదకద్రవ్యాలను నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన సైకిల్ యాత్ర ఈ నెల 16న ఉ. 9 గంటలకు శ్రీకాకుళం నగరంలోకి ప్రవేశిస్తుందని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, స్వచ్ఛంద, సేవా సంస్థలు, యువత పెద్దఎత్తున హాజరు కావాలని కోరారు.