VIDEO: తొలిసారిగా హైదరాబాద్‌కు.. ఆదివాసీలు

VIDEO: తొలిసారిగా హైదరాబాద్‌కు.. ఆదివాసీలు

ఆదిలాబాద్‌ జిల్లా ఆదివాసీలు తొలిసారిగా హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. తెలంగాణ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను ఉట్నూరు మండలం గోండుగూడ వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు. మూడు ఆదివాసీ పల్లెల నుంచి 250 మంది 7 ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్‌ తరలివెళ్లారు. రెండు రోజుల పాటు నగరంలోని పలు ప్రాంతాలను వారు సందర్శించనున్నారు.