కోదాడలో 'ఈడీ' కలకలం.. ఓ వ్యాపారి ఇళ్లలో సోదాలు
SRPT: ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో కోదాడలోని ఓ వ్యాపారి నీలా సత్యనారాయణ లక్ష్యంగా ఈడీ అధికారులు ఏకకాలంలో ఆరు చోట్ల దాడులు చేశారు. కిట్స్ కళాశాల, రైస్ మిల్లుల్లో రికార్డులు పరిశీలిస్తున్నారు. గతంలో సీఎంఆర్ రైస్ గోల్‌మాల్, పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టడం స్థానికంగా ప్రకంపనలు సృష్టించింది.