'గుడుంబా విక్రయిస్తే కఠిన చర్యలు'

JGL: గొల్లపల్లి మండల కేంద్రంలోని నల్లగుట్టలో గుడుంబా విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై ఎం. కృష్ణసాగర్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు దాడి చేసి, ఐదు లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుడుంబా విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.