ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం

ప్రకాశం: కోమరోలులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా అధికారులు తెలిపారు. విద్యార్థులకు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించి తీసుకోవలసిన జాగ్రత్తలను తెలిపారు.