భూ భారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

భూ భారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

MHBD: భూ భారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ అనిల్ కుమార్ సూచించారు. ఇనుగుర్తి తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన భూభారతి రెవెన్యూ సదస్సు రికార్డులను, పత్రాలను తనిఖీ చేశారు. వివిధ విభాగాల కింద స్వీకరించిన దరఖాస్తుల్లో సరైన పత్రాలు ఉండి ఆమోదయోగమైన వాటిని త్వరగా పరిష్కరించాలన్నారు.