VIDEO: డిమాండ్ల పరిష్కారం కోసం యూటీఎఫ్ నిరసన
కోనసీమ: పి. గన్నవరంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ నియోజకవర్గ స్థాయిలో UTF నాయకులు ఇవాళ నిరసన చేపట్టారు. ఈ మేరకు CPS రద్దు చేయాలని, పీఆర్సీని అమలు చేయాలని, ఉద్యోగుల పెన్షన్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.