రోడ్డు పునరుద్ధరణ చేపట్టాలని వినతి
NRPT: నారాయణ మండలం అప్పిరెడ్డిపల్లి నుంచి కోటకొండ వరకు రోడ్డు పునరుద్ధరణ పనులు నాలుగేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోవడంపై సీపీఐ మాస్ లైన్ జిల్లా కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు ప్రతాప్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.