రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ
ATP: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. సోమవారం ఆయన శెట్టూరు మండలం చెర్లోపల్లి ప్రధాన రహదారి నుంచి ఖైరేవు గ్రామానికి 1.5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించామని, త్వరలో మరిన్ని రోడ్లు నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు.