బీరు తయారీ కేంద్రాలకు దరఖాస్తుల ఆహ్వానం

MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మైక్రోబ్రూవరీ ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ తెలంగాణ ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసిందని జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి నందగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు దర ఖాస్తులను ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆదిలాబాద్ కార్యా లయంలో ఈనెల 25లోపు సమర్పించాలని పేర్కొన్నారు.