భార్య గొంతు కోసిన భర్తకు రిమాండ్

RR: అదనపు కట్నం కోసం భార్య గొంతు కోసిన భర్తను నాగోల్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. లక్ష్మీనరసింహ కాలనీలో ఉంటున్న వేణుగోపాల్ భార్యను అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో ఆదివారం బంధువుల ఇంట్లో గృహప్రవేశం వేడుకకు రావాలని మహాలక్ష్మి వేణుగోపాలను కోరగా కోపోద్రిక్తుడై బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. కాగా, సోమవారం రిమాండ్‌కు తరలించారు.