పకడ్బందీగా మహాశివరాత్రి ఏర్పాట్లు
కృష్ణా: యనమలకుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలను భక్తులు శాంతియుతంగా దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తెలిపారు. భద్రత, క్యూలైన్, త్రాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణపై ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు. ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా పర్యవేక్షణ కొనసాగిస్తామని చెప్పారు.